AP: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుపోషకులకు రాయితీపై పశువుల షెడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. గేదెలు, ఆవుల షెడ్లకు 90 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు, గొర్రెలు, మేకల షెడ్లకు 70 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు ఇస్తామని తెలిపారు. కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీపై రూ. 1.32 లక్షలు అందజేస్తామన్నారు.