కంటైనర్‌ లారీ బోల్తా.. విశాఖలో హైవేపై భారీ ట్రాఫిక్

విశాఖలోని షీలానగర్ కూడలి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న లారీ ఈ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో షీలానగర్ నుంచి విశాఖ విమానాశ్రయం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, వందలాది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది నాలుగు క్రేన్‌ల సహాయంతో లారీని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్