AP: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసు నమోదైంది. జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలతో ఓ వ్యక్తి జిల్లా సర్వజన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్ష నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.