ఏపీలో అవినీతి పెరిగింది, శిక్షలు తగ్గాయి: ఏసీబీ

AP: 2025లో ఏపీలో అవినీతి కేసులు పెరిగాయని, అవినీతి అధికారులకు శిక్షలు తగ్గాయని ఏసీబీ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ శాఖ అవినీతిలో మొదటి స్థానంలో ఉంది. మొత్తం 115 కేసుల్లో 69 ట్రాప్ కేసులు, 8 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. వైసీపీ ప్రభుత్వ చివరి సంవత్సరంలో 48% శిక్షలు విధించగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో 2025లో ఇది 46%కి తగ్గింది. అవినీతిని అరికట్టడానికి ప్రజల సహకారం అవసరమని, శిక్షల రేటు 75% ఉండాలని ఏసీబీ డీజీ అతుల్‌ సింగ్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్