ప్రకాశం జిల్లాలో చాలా లేటుగా కౌంటింగ్ ప్రారంభం!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు తుఫాన్ ప్రభావంతో ఆలస్యంగా మొదలైంది. ఉదయం 8 గంటలకు జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైంది. వల్లూరు సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు ముందుగా ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕