ఏపీలో ప్రారంభమైన MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్

ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటలకు ప్రారంభించి, రాత్రి 8 గంటల లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కాగా, ఈ ఎన్నికల్లో 70.72% పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕