AP: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. నిబంధనల ప్రకారం, అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.