వృద్ధురాలిని హతమార్చి నగదు కాజేసిన జంట అరెస్ట్

AP: తిరుపతిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వృద్ధురాలిని హత్య చేసి, నగదు, నగలు దోచుకున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. చెర్లోపల్లిలో ఈ నెల 1వ తేదీ రాత్రి ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు లోకేశ్వరి (68) మృతి చెందారు. ఆమె శరీరంపై గాయాలను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. ఇంటిపై అద్దెకుంటున్న రెడ్డెప్ప, మహాలక్ష్మి అనే జంట ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఈ హత్య చేసినట్లు వెల్లడైంది. వారి నుంచి గిల్టు నగలు, రూ.14 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్