ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్‌పై కోర్సులు

AP: వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి ఉన్నత విద్యలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. విశ్వవిద్యాలయాల్లో క్లస్టర్‌ ఆధారిత పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసి, ఒక్కో వర్సిటీ ఒక్కో రంగంలో ప్రత్యేకత సాధించేలా ప్రణాళిక రూపొందించింది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సెమీకండక్టర్‌ రంగాల్లో బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులు ప్రారంభించనున్నారు. వర్సిటీల మధ్య క్రెడిట్‌ బదిలీ విధానం అమలు చేయనున్నారు. యువతకు కోర్సులపై అవగాహన పెంచేందుకు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ప్రచారం చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్