ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 15 రోజుల యూరప్ పర్యటనకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఏవైనా 15 రోజులు ఆయన తన భార్య భారతీరెడ్డితో కలిసి యూరప్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. విదేశాల్లో ఉన్నప్పుడు వాడే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను సీబీఐకి ముందుగానే అందించాలని, పర్యటన సమాచారాన్ని కూడా ముందే తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. అక్కడ చదువుకుంటున్న తమ కూతుళ్లతో సమయం గడపడానికి జగన్ ఈ పర్యటన చేపట్టనున్నారు.