AP: తెలుగు తేజం, టీంఇండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు మంత్రులు అనిత, సంధ్యారాణి, ఎంపీ కేశినేని చిన్ని, క్రికెటర్ మిథాలీ రాజ్ స్వాగతం పలికారు. కాసేపటి తర్వాత సీఎం చంద్రబాబును శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన విషయం తెలిసిందే.