AP: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ దిశగా ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సాగును సున్నాకు చేర్చడం వల్ల రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందని ఆమె వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక 'ఈగల్' టాస్క్‌ఫోర్స్ 1.20 లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిందని వెల్లడించారు.