జగన్‌పై విమర్శలు.. రెడ్డి వర్గానికి VSR నాయకత్వం వహించనున్నారా?

AP: రాష్ట్రంలో కమ్మ, క్రిస్టియన్లు మాత్రమే అధికారంలోకి వస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(VSR) బుధవారం విశాఖ మీడియా సమావేశంలో నొక్కి చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కమ్మ, రెడ్డి అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు రెడ్డికి బదులు క్రిస్టియన్ అనే మాటను VSR తీసుకువచ్చారు. అంటే వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్ అని VSR నేరుగానే చెప్పారు. రెడ్ల ఆత్మగౌరవం అని VSR.. రెడ్డి వర్గ ఓటు బ్యాంకును సొంత ఆస్తిగా భావించే వైఎస్ కుటుంబం రెడ్డి కాదని తేల్చి చెప్పారు. రెడ్డి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు, ఆ వర్గానికి నాయకత్వం వహించడానికి VSR ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕