సీఎం చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. వీడియో వైరల్

AP: విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పేర్లతో హైటెక్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి వారి తరహాలో వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు. సీతంపేటలో ఉన్న భూ వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మబలికి శ్రీనివాస్‌రెడ్డి అనే బాధితుడి నుంచి విడతల వారీగా రూ.80 వేల వరకు వసూలు చేశారు. అనంతరం మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్