బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రా తీరంవైపు కదులుతోంది. మంగళవారం సాయంత్రానికల్లా ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయానికి అతి తీవ్ర తుఫానుగా బలపడి, శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు-తుని మధ్య తీరాన్ని దాటనుంది. ఇది ప్రస్తుతం చెన్నైకి 610, మచిలీపట్నానికి 660, విశాఖపట్నానికి 670, గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.