కోస్తాను రెండుసార్లు ముంచెత్తిన అర్నబ్ తుఫాన్

AP: అర్నబ్ తుఫాన్ సాధారణ తుఫానుల కంటే భిన్నంగా కోస్తాంధ్ర తీరాన్ని రెండుసార్లు దాటి విధ్వంసం సృష్టించింది. 27వ తేదీ అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, సుమారు 6 గంటల పాటు తుఫాన్ తీరం వెంబడే ప్రయాణించింది. యానాం-నరసాపూర్ వద్ద తీరం దాటిన తర్వాత యూటర్న్ తీసుకుని, కోనసీమ-మచిలీపట్నం మధ్య మరోసారి తీరాన్ని తాకింది. గంటకు 120 నుంచి 150 కి.మీ వేగంతో వీచిన గాలులు తీర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగించాయి. బంగాళాఖాతంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ తుఫాన్ మరింత తీవ్రరూపం దాల్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕