AP: తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అర్నాబ్ తుఫాన్ కారణంగా వాతావరణ శాఖ (IMD) అప్రమత్తమైంది. దీని ప్రభావంతో కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్‌ను జారీ చేశారు. అలాగే విశాఖ, గంగవరం, మచిలీపట్టణం, నిజాంపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ ఇచ్చారు. తుఫాన్ తీరం దాటే ప్రాంతానికి ఇరువైపులా 100 కిలోమీటర్ల పరిధిలో సముద్రపు ఉప్పెన వచ్చే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.