అర్నబ్ తుఫాన్‌తో తీర ప్రాంతాలకు ముప్పు

AP: అర్నబ్ పెను తుఫాన్‌గా మారుతోందని, దీనివల్ల తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఎగసిపడే అలలతో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాకినాడ జిల్లా పొలెకుర్రులో 300 మీ, పొన్నాడలో 200 మీ, పేరుపాలెంలో 190 మీ, జి.వేమవరంలో 180 మీటర్లు ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అర్నబ్ తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕