తుఫాన్ నష్టాల అంచనా వేగవంతం: మంత్రి అచ్చెన్నాయుడు

AP: తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టాల అంచనాను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 14 జిల్లాల్లో 1,734 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 1,229 గ్రామాల్లో 44,029 హెక్టార్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. బాధిత రైతులందరి వివరాలను తప్పకుండా నమోదు చేయాలని, జిల్లాలు, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను అందించాలని ఆయన అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕