దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, ఎల్‌ఎన్‌పేట, హిందూపురం, జి.సిగడాం మండలాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కల్లాల్లో ధాన్యం రాశులు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిత్వా తుపాను దృష్ట్యా అధికారులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తం చేసి, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.