దిత్వా తుఫాన్.. ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

AP: దిత్వా తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో దక్షిణ ఏపీ తీర ప్రాంతం మీదుగా కదులుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది చెన్నైకి 50 కి.మీ, పుదుచ్చేరికి 130 కి.మీ, నెల్లూరుకి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని, రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల రాబోయే మూడు రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్