బంగాళాఖాతంలో ఏర్పడిన డిత్వా తుఫాను ముంచుకొస్తుండటంతో ఏపీ, చెన్నై తీరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నవంబర్ 28 - 29 మధ్య తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని గాలులు వీస్తాయని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ప్రభావం ఉంటుందని సమాచారం.