AP: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే తూర్పు గోదావరి, అన్నమయ్య, కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. 27, 28 తేదీల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు.