AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. తూ.గో, అన్నమయ్య, ఏలూరు, కడప, విశాఖ జిల్లాల్లో 27, 28న సెలవులు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో 27, 28, 29న సెలవులు, కాకినాడ జిల్లాలో 27, 28, 29, 30, 31న సెలవులు, పల్నాడు జిల్లాలో 27న, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయని వెల్లడించారు.