ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్: APSDMA

AP: రాష్ట్రం వైపు తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం చెన్నైకి 700 కి.మీ, విశాఖకు 800 కి.మీ, గోపాల్‌పూర్‌కు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. సాయంత్రానికి తుఫాన్‌గా, రేపు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణిస్తూ శుక్రవారం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుఫాన్‌గా నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ-అతిభారీ వర్షాలు; కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕