AP: విజయనగరం జిల్లాలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితిని గమనించిన అధికారులు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాన్ కారణంగా తలెత్తే విపత్తులను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.