భారీ వర్షాలు.. నేడు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నానికి నైరుతి దిశలో ఉత్తరాంధ్ర తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుండటంతో ఏపీ, తెలంగాణలో మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఆకస్మిక వరదలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నెల 27 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕