రేపు బలపడనున్న వాయుగుండం: APSDMA

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఆదివారం అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఉదయానికి తీవ్రవాయుగుండంగా, సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕