మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖ వచ్చే రెండు విమానాలు రద్దు

మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల కారణంగా విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణం నెలకొంది. దీంతో, విజయవాడ-విశాఖ, బెంగళూరు-విశాఖ మార్గాల్లో నడవాల్సిన రెండు విమానాలను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్