AP: మురసు తుఫాన్ తీరానికి చేరువగా వస్తోంది. దక్షిణ కోస్తాంధ్రపై విరుచుకుపడనుంది. అర్ధరాత్రి తర్వాత ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతం కావలికి 60, నెల్లూరుకు 80, ఒంగోలుకు 90 కి.మీ. దూరంలో ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.