AP: మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై, వాగులు పొంగి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాజమహేంద్రవరంలోని ఇందిరానగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు పాములు, విషపురుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.