AP: ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 26వ తేదీ తర్వాత వాయుగుండంగా మారి, 29 లేదా 30వ తేదీన ఉత్తర కోస్తా ప్రాంతంలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీనివల్ల ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు, నేడు అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎస్డీఎంఏ (SDMA) పేర్కొంది.