AP: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇది విశాఖపట్నానికి తూర్పున 410 కి.మీ, గోపాల్‌పూర్‌కు 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 23 రాత్రి నుండి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య విశాఖ – గోపాల్‌పూర్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనితో కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీరప్రాంత మండలాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.