ఒడిశా తీరాన్ని దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి బాలాసోర్(ఒడిశా) సమీపంలో తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్