దళిత క్రైస్తవులకు SC హోదా ఇవ్వాలి: వైసీపీ (వీడియో)

AP: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చి వారికి సమానత్వం, సామాజిక న్యాయం అందించాలని వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోవని ఆయన పేర్కొన్నారు. గత కమిషన్ల సిఫారసులను అమలు చేసి, ఎస్సీ హోదాపై ఉన్న మత పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కులు, రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్