కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయనాలుబ

AP: కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయనాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు. మూత్రపిండాలు దెబ్బతినడం, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది మృతి చెందారు. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’ పేరుతో విక్రయింపులు జరుగుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది ఆత్మహత్య చేసుకోవడంతో, ఈ పొడిలో ఏముందో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేశారు. ఈ పొడిలో ‘ఆరమైన-ఓ’ అనే రసాయనాన్ని వాడుతున్నారని, దీన్ని పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్