AP: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వద్ద గోదావరి నదిపై అనుమతి లేకుండా నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అధికారికంగా మూసివేసిన రేవులో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే కోనసీమ జిల్లాకు ఈ ప్రమాదకర ప్రయాణాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.