టీడీపీ సీనియర్ నేత మరణం.. ముఖ్యమంత్రి విచారం

AP: టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీకి సేవలందిస్తున్నారని, ఇటీవల మహానాడులో ఆయనను కలిసినట్లు, బాలకృష్ణతో కలిసి సత్కరించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆగయ్య అంకితభావంతో చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రతి టీడీపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్