మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంబంధిత శాఖలతో చర్చలు జరిపి త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రంతో కలిసి ఈ పథకం అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.