పోలీస్ ఉద్యోగాల భర్తీపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు

AP: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 ఉద్యోగాల భర్తీపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. పోలీస్ శాఖలో మొత్తం 19,999 ఖాళీలున్నాయని RTI ద్వారా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని, వీటి భర్తీకి ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ ట్రస్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. వీటిలో 11,639 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్