AP: పార్టీ ఫిరాయింపులపై స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ జాప్యంపై విచారణ సందర్భంగా, న్యాయమూర్తి జస్టిస్ జోయా మల్యా బాగ్చీ న్యాయవ్యవస్థపైనే స్వీయ విమర్శలు చేశారు. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే ముందు, కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల పెండింగ్‌ను పరిశీలించాలని ఆమె అన్నారు. స్పీకర్లకు నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గడువు విధించినా, అది అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.