AP: సీఎం చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విశాఖ నేతలతో భేటీ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నంద్యాల ఉప ఎన్నికల్లో ఘోరాలు చేశారు. కానీ, అది తాత్కాలికమే.. శాశ్వతంగా నిలబడదు’ అని అన్నారు.