AP: రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీని అణగదొక్కాలనే కోణంలో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.