నేడు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం, మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో రూ.200 కోట్లతో పిఠాపురం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రూ.80 కోట్లతో గొల్లప్రోలు వాటర్‌ వర్క్స్‌ ఉన్నాయి. అమృత్‌ 2.0 కింద పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీటి ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕