AP: 2018లో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను మంత్రి నాదెండ్ల మనోహర్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఈ మేరకు పవన్‌తో తనకున్న జర్నీ అనుభవాలను పంచుకున్నారు. అయితే మంత్రి నాదెండ్ల పోస్ట్‌ని ట్యాగ్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఏపీలో యువత ఉచిత పథకాలు అడగడం లేదు. సంక్షేమ పథకాలు అడగడం లేదు. 25 సంవత్సరాల భవిష్యత్తును అడుగుతున్నారు’ అంటూ పవన్ రీట్వీట్ చేశారు.