AP: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘YSR విగ్రహ ధ్వంసం అనేది పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. ఆదినారాయణ రెడ్డి నీకే అడుగుతున్న చెప్పు. మా జగనన్న ఐదేళ్ల పాలన అంటే 1800 రోజుల్లో నువ్వు ఒక్క 20 రోజులు అయినా జమ్మలమడుగులో ఉన్నావా? మేం ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గాల్లోనే మా నాయకులు ఉంటున్నారు. మీలా పారిపోలేదు. కార్యకర్తల కోసం నిలబడిన వాళ్ళను నాయకులు అంటారు’ అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.