దేవాన్ష్ పుస్తక ప్రియత్వం.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP: ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన 11 ఏళ్ల కుమారుడు దేవాన్ష్ పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తిని అసెంబ్లీలో వెల్లడించారు. తన సతీమణి బ్రాహ్మణి దేవాన్ష్ ను ఫోన్, ట్యాబ్ ల వంటి వాటికి దూరంగా ఉంచి, పుస్తకాలు చదివే అలవాటు నేర్పారని తెలిపారు. దేవాన్ష్ ఒక రోజులోనే పుస్తకాలు చదివేస్తాడని, తాను నెల రోజులు తీసుకుంటానని చెప్పారు. పిల్లల్లో పుస్తక పఠనం పెంచేందుకు ప్రతి నియోజకవర్గంలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని, 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే చట్టం తేవాలని లోకేశ్ ప్రతిపాదిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్