AP: సంస్కరణలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు రూపొందించాలని సూచించారు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతిందని, పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ.. వాటి గురించి చెప్పుకోలేకపోయానన్నారు.