ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం: పవన్

AP: ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 18 నగర వనాలను వర్చువల్‌గా ప్రారంభించారు. కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రూ.36 కోట్ల వ్యయంతో 18 నగర వనాలను అభివృద్ధి చేయనున్నామని, అటవీ సంపద, సంప్రదాయాల కలబోతగా వనాలు నిర్మించాలన్నారు. వినోదం, ఆరోగ్యం ఒకే చోట ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్