కేశినేని చిన్నిపై దేవినేని అవినాశ్ తీవ్ర విమర్శలు

AP: ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడిలపై తీవ్రంగా మండిపడ్డారు. తిరువూరు సమీపంలోని నెమలి వేణుగోపాల స్వామి ఆలయ గొప్పతనాన్ని వారు బ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్నికి పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హుందాతనం లేదని విమర్శించారు. గతంలో విజయవాడ ఉత్సవాల పేరుతో కేశినేని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ప్రభుత్వ తప్పుడు పనులను ప్రశ్నించేవారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తిరువూరు ప్రజలకు ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని అవినాశ్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్